Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ముడి ఇనుము ఉత్పత్తిలో అతిపెద్ద సంస్థ 'ఎన్ఎండీసీ'...సీఎండీ సుమిత్ దేవ్ బైలాడిలా(ఛత్తీస్గఢ్) క్షేత్రాన్ని సందర్శించారు. బైలాడిలా ఖనిజ నిక్షేపాల పరిధిలోని కిరాందుల్, బాచెల్లి ప్రాంతాల్లో ఆయన రెండు రోజులపాటు పర్యటించారు. మైనింగ్ ప్రాంతాల్లో తవ్వకాలు, ముడి ఇనుము నిల్వలు..తదితర అంశాలపై టెక్నికల్ డైరెక్టర్ సోమ్నాథ్ నందితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఖనిజ నిల్వ సామర్థ్యం పెంపుపై గతంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకున్నామా?లేదా? అన్నది అధికారులతో చర్చించారు. 'ఎన్ఎండీసీ'కి కిరాందుల్, బాచెల్లి క్షేత్రాల నుంచి అత్యధిక మొత్తంలో ముడి ఇనుము సరఫరా అవుతోంది. బైలాడిలాలో రెండు రోజుల పర్యటన సందర్భంగా అక్కడి ఉద్యోగులు, కార్మికులు, ఉన్నతాధికారులతో సీఎండీ సుమిత్ దేవ్ పలు విషయాలు చర్చించారు.2030కల్లా100 మెట్రిక్ టన్నుల మైనింగ్ లక్ష్యాన్ని చేరుకోవాలని తెలిపారు. దీనికి సంబంధించి రోడ్ మ్యాప్ విడుదల చేశారు. దేశ నిర్మాణరంగ అవసరాల్ని తీర్చటంలో బైలాడిలా, ఎన్ఎండీసీ సంస్థ ముఖ్య పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 10 నెలల్లో 32.88 మెట్రిక్ టన్నుల ముడి ఇనుము రాగా, దాంట్లో 32.60 మెట్రిక్ టన్నులు అమ్ముడుపోయిందని సంస్థ తెలిపింది.