Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ విధి నిర్వహణలో గవర్నర్ విఫలం : సీఎం స్టాలిన్
చెన్నై : నీట్ నుంచి విద్యార్థులను మినహాయించే బిల్లును ఆమోదించడం కోసం తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్నది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. అనంతరం ఈ బిల్లును రాష్ట్ర గవర్నర్‌కు మళ్లీ పంపనున్నారు. అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌కు సంబంధించిన తేదీని అసెంబ్లీ స్పీకర్ ఎం. అప్పవు త్వరలో ప్రకటిస్తారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి మ సుబ్రమణియన్ తెలిపారు. నీట్ బిల్లు విషయంపై చర్చించడానికి శనివారం ఆల్‌పార్టీ మీటింగ్ జరిగింది. అసెంబ్లీ స్పీకర్‌కు బిల్లును వెనక్కి పంపడానికి ముందు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి దానిని 143 రోజుల పాటు తన వద్దే పెట్టుకున్నారని తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ చెప్పారు. విద్యార్థులను నీట్ నుంచి మినహాయించాలని కోరుతూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెడికల్ కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని తమిళనాడు సర్కారు ఆ బిల్లులో ప్రతిపాదించింది. అయితే, ఈ బిల్లును గురువారం నాడు గవర్నర్ ఈ బిల్లును వెనక్కి పంపారు. ఇది విద్యార్థుల ప్రయోజనానికి వ్యతిరేకమని ఆర్.ఎన్ రవి పేర్కొన్నారు. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించకుండా తన రాజ్యాంగబద్ధమైన విధిని నిర్వర్తించడంలో గవర్నర్ విఫలమయ్యారని స్టాలిన్ అన్నారు. శనివారం జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌ను ప్రతిపక్ష ఏఐఏడీఎంకే, దాని మిత్రపక్షం బీజేపీ బారుకాట్ చేశాయి. అయితే, ఏఐఏడీఎంకే అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో పాల్గొంటుందని తాను ఆశిస్తున్నట్టు సుబ్రమణియన్ తెలిపారు.