Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటిలేటర్‌పై చికిత్స
- ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి వెల్లడి
ముంబయి : ప్రముఖ సీనియర్ గాయని లతా మంగేష్కర్ (92) ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించింది. దీంతో ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిసు ్తన్నామని ముంబయిలోని క్యాండీ ఆస్పత్రి వైద్యులు ప్రతీత్ సమ్దాని తెలిపారు. లతా మంగేష్కర్ ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. నిమోనియా, కోవిడ్-19 బారిన పడిన లతా మంగేష్కర్ గత నెల 8న ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఆ రెండు వ్యాధుల నుంచి బయటపడినప్పటికీ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఆమె చికిత్సకు స్పందిస్తున్నారనీ, ఆరోగ్యం విషయం మెరు గుదల కనిపించిందని లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు గతనెల 22న తెలిపారు. అలాగే, ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడుతు న్నదనీ, ఇంకా ఐసీయూలోనే ఉన్నారని గతనెల 25న సైతం వివరించారు. వదంతులను వ్యాప్తి చేయొద్దని కూడా కోరారు.అయితే, ఇప్పుడు లతా మంగేష్కర్ పరిస్థితి మళ్లీ ఒకసారి విషమించడంతో ఆమె అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నది. దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నతో పాటు పద్మ విభూషన్, పద్మ భూషన్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అవార్డులను ఆమె పొందారు. 1940లో లతా మంగేష్కర్ కెరీర్ ప్రారంభమై ఇప్పటి వరకూ కొనసాగింది.