Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాలతో చర్చిస్తామన్న నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : వస్తు, సేవల పన్ను (జిఎస్టి) పరిధిలోకి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్)ను చేర్చే అంశాన్ని జిఎస్టి కౌన్సిల్ ముందు ఉంచనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతర్జాతీయంగా ఇంధన ధరలు భాగా పెరిగినందున ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తాత్కాలికంగానైనా తగ్గించాలని స్పైస్‌జెట్ ఛైర్మన్ అజరు సింగ్ చేసిన విజ్ఞప్తిపై ఆమె ఆదివారం స్పందించారు. విమానయాన సంస్థలే కాకుండా పెరుగుతున్న ఇంధన ధర అందరికీ ఆందోళన కలిగిస్తోందని, కరోనా సంక్షోభం నుంచి విమానయాన సంస్థలు ఇప్పటికీ బయటపడలేదని చెప్పారు. జిఎస్టిలో ఎటిఎఫ్చేర్చే నిర్ణయం ఒక్కరే నిర్ణయించేది కాదని, తదుపరి కౌన్సిల్ సమావేశమైనప్పుడు చర్చించేందుకు ఈ అంశాన్ని టేబుల్‌పై ఉంచుతామని తెలిపారు. విమానయాన రంగం ఆందోళనలపై బ్యాంకులతోనూ చర్చిస్తామని ఆమె పేర్కొన్నారు.