Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : మంత్రుల కమిటీ చర్చల సందర్భంగా ఎటువంటి అగ్రిమెంట్లపై సంతకాలు చేయలేదని పిఆర్సిపై స్టీరింగ్ కమిటీ సభ్యులు జోసఫ్ సుధీర్‌బాబు, హృదయరాజు, కెఎస్ఎస్ ప్రసాదు ఆదివారం తెలిపారు. సమావేశానికి హాజరైన సందర్భంగా అటెండెన్స్ షీట్ మినహా ఎటువంటి అగ్రిమెంటు కాగితాలపై తాము సంతకాలు చేయలేదన్నారు. ఫిట్మెంటు కనీసం 30 శాతం ఇవ్వాలని తదితర అంశాలపై మంత్రులను గట్టిగా అడిగామని తెలిపారు. దానికి అంగీకరించకపోగా 23 శాతానికి మించి మార్పులు చేసే ఆలోచన లేదని, దీనిపై చర్చించడానికి కూడా అవకాశం లేదని మంత్రులు తెలిపారని అన్నారు. అంతేకాకుండా సిఎం వద్ద జరిగే సమావేశంలో ఫిట్‌మెంటుపై మాట్లాడటానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలిపారన్నారు. దీనిపై మంత్రులకు, స్టీరింగ్ కమిటీకి తమ అభ్యంతరం వ్యక్తం చేశామని స్పష్టం చేశారు. మంత్రుల సమావేశంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన గ్రాట్యూటీ, సిపిఎస్ రద్దు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సిఎం పునరాలోచన చేసి వేతన జీవులకు న్యాయం చేయాలని వారు కోరారు.