Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉరవకొండ : ఏపీలోని అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి 7:30 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిది మంది దుర్మణం చెందారు. వివాహ వేడుకల్లో పాల్గొని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామానికి చెందిన బిజెపి యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోక వెంకప్ప (60) కుమార్తె వివాహం కర్నాటక రాష్ట్రం బళ్లారిలో ఆదివారం జరిగింది. వివాహం అనంతరం ఆయన తన అక్క కూతురు స్వాతి (38), ఆమె పిల్లలు జాహ్నవి (12), జస్వ్ం (13), సమీప బంధువులు, బొమ్మనహాల్ మండలానికి చెందిన అశోక్ (30), రాధమ్మ (29), సరస్వతి (33), పిల్లలపల్లి గ్రామానికి చెందిన శివమ్మ (45), రాయలదొడ్డి గ్రామానికి చెందిన సుభద్రమ్మ (45)లతో కలిసి ఇన్నోవా కారులో తన స్వగ్రామానికి బయలుదేరాడు. ఉరవకొండ మండలం బూదగవి గ్రామ శివారు వద్ద ఎదురుగా వస్తున్న 16 చక్రాల పెద్ద లారీ వారి కారును ఢకొీంది. రెండు వాహనాలూ వేగంగా ఎదురెదురుగా ఢకొీనడంతో ఇన్నోవా నుజ్జునుజ్జయ్యింది. గుంతకల్లు డిఎస్పి నరసింగప్ప, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఉరవకొండ సిఐ శేఖర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని లారీ కింద కూరుకుపోయిన ఇన్నోవా కారును ప్రొక్లయినర్ సాయంతో బయటకు తీయించారు. అందులో ఉన్న వారిని అతి కష్టమ్మీద బయటకు తీశారు. అప్పటికే వారంతా మరణించారు. ఒకే ప్రమాదంలో తొమ్మిది మంది మరణించడంతో ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. సంఘటనా స్థలాన్ని ఎస్పి ఫక్కీరప్ప పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.