Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో 1.9 శాతం.. ఏపీలో 8.2 శాతం
- కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ సమాచారం
న్యూఢిల్లీ : భారత్ ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యల్లో మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) ఒకటి. దీనికి ఎందరో చిన్నారులు, మహిళలు బాధితులుగా ఉన్నారు. అయితే, మానవ అక్రమ రవాణా కేసుల్లో శిక్షా రేటుమాత్రం ఆందోళనను కలిగిస్తున్నది. ఈ శిక్షా రేటులో తగ్గుదల కనిపిస్తున్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత నాలుగేండ్లుగా ఇది స్థిరంగా తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తున్నది. ఈ సమాచారాన్ని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ పార్లమెంటులో వెల్లడించింది. బాధితులకు సరైన మద్దతు లభించకపోవడమే శిక్ష రేటులో తగ్గుదలకు కారణమని నిపుణులు తెలిపారు. ఈ పరిస్థితులు మానవ అక్రమ రవాణాకు ప్పాలడే నిందితులకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయనీ, నిర్దోషుల సంఖ్య పెరుగుతున్నదని వివరించారు. కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. అసోం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, గోవా, పంజాబ్ రాష్ట్రాలలో ఇలాంటి కేసుల్లో ఏ ఒక్కరికైనా శిక్ష పడకపోవడం గమనార్హం. 2020లో దీనికి సంబంధించిన అన్ని కేసులు నిందితులను నిర్దోషులుగా విడుదలకు దారి తీశాయి. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ లలో శిక్షా రేటు 1.9 శాతంతో చాలా తక్కువగా ఉన్నది. 2020లో తమిళనాడులో 66.7 శాతం, ఢిల్లీ 40 శాతం, మధ్యప్రదేశ్లో 25 శాతం, ఉత్తరాఖండ్లో 20 శాతం, జార్ఖండ్లో 19.2 శాతం, ఆంధ్ర ప్రదేశ్లో 8.2 శాతంతో చక్కని శిక్షా రేటును నమోదు చేశాయి. బాధి తులు కోర్టు విచారణలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూసుకో వడానికి ప్రభుత్వం ఏదో ఒక రకమైన భత్యాన్ని తీసుకురావాలని బీహార్లోని భూమిక విహార్ ఎన్జీవో డైరెక్టర్ శిల్పి అన్నారు.