Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూగబోయిన నైటింగేల్
- ప్రభుత్వలాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు
- అశ్రునయనాలమధ్య అంతిమ వీడ్కోలు
- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
ముంబయి : ఆరు దశాబ్దాలకు పైగా నైటింగేల్‌గా తన గాన మాధుర్యాన్ని అందించిన లతా మంగేష్కర్(92) కన్నుమూశారు. కరోనా, న్యుమోనియాతో 29 రోజులపాటు బ్రీచ్క్యాండి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ...ఆదివారం లతా స్వరం ఆగిపోయింది. 30కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో ఆమె సుమారు 50 వేల గీతాలను ఆలపించారు. అత్యధికంగా హిందీ, మరాఠీ భాషల్లో ఆమె పాటలు పాడారు. లతాజీ జనవరి 8న కరోనాతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్యులు, కుటుంబ సభ్యులు ప్రకటించారు. అయితే, శనివారం ఆమె ఆరోగ్యం మరోసారి క్షీణిం చింది. మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నిం చారు. అయినా ఫలితం లేకపోయింది. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి, ఆది వారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీత అధ్యాయంలో ఒక శకం ముగిసింది. 'నైటింగేల్ ఆఫ్ ఇండియా'గా లతాజీ పేరు పొందారు. భారతరత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే వంటి దేశ అత్యున్నత పురస్కారాలు ఆమెను వరించాయి. ఫ్రాన్సు ప్రభుత్వం ఆమెకు 'ది లీజియన్ ఆఫ్ హానర్' పురస్కారం అందించి, గౌరవించింది. 1929 సెప్టెంబర్ 28న ఇండోర్‌లో జన్మించిన లతా మంగే ష్కర్ ఐదుగురు తోబుట్టువుల్లో పెద్దవారు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ శాస్త్రీ య సంగీత విద్వాంసుడు, ప్రముఖ రంగస్థల నటుడు. తల్లి షీవంతి. తండ్రి ఆమెకి మొదటి గురువుగా సంగీతంలో సరిగమలు నేర్పించారు. 13 ఏండ్ల వయసులో తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ కోసం 1942లో ఆమె మరాఠీ సినిమాల్లో నటిస్తూనే.. నేపథ్య గాయనిగా తన ప్రస్థానం ప్రారంభించారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
లతా మంగేష్కర్ భౌతిక కాయానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముంబైలోని శివాజీ పార్కులో ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రధాని మోడీ, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, షారుఖ్ ఖాన్, గీత రచయిత జావెద్ అక్తర్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తదితరులు హాజరై... ఆమెకు అంతిమ నివాళ్లు అర్పించారు. లతా మంగేష్కర్ మృతికి సీపీఐ(ఎం) సంతాపం ప్రకటించింది. ''లతాజీ స్వరం మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది.' అని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు రోజులపాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించింది.