Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులపై రాజకీయం చేసే హక్కు ఎవరికీ లేదు : లోక్‌సభలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ విభజించు పాలించు అనే పాలసీని అవలంభిస్తున్నదని, ఆ పార్టీ తుక్డే తుక్డే గ్యాంగ్‌కు నాయకత్వంగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులపై రాజకీయం చేసే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ఈ దేశ బలం చిన్న, సన్నకారు రైతులనీ.. వారిని బలవంతులను చేయాల్సిన అవసవరం ఉందని ఆయన అన్నారు. కానీ కొందరు వీరిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారనీ, వారి బాధను అర్థం చేసుకోవడం లేదని అన్నారు. సోమవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన అధికారాన్ని కోల్పోయినప్పటికీ కాంగ్రెస్ నేతలకు గర్వం, అహంకారం తగ్గలేదన్నారు.
ఇక దేశ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వాటి గురించి వివరిస్తూ దేశంలోని పేద ప్రజలు గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నారనీ, ఇంట్లో టాయిలెట్లు నిర్మించుకుంటున్నారని మోడీ అన్నారు. వీటికి ప్రభుత్వం నుంచి అందే సాయం నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో పడుతోందని తెలిపారు.కానీ కొందరు ఇది ఓర్చుకోలేక పోతున్నారని, వారింకా 2014కు ముందు ఆగిపోయారని అన్నారు.
''తమిళనాడు ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గాయపర్చింది. వాళ్లు ఈ దేశాన్ని విభజించి పాలించాలని చూస్తారు. కానీ నేను తమిళనాడు ప్రజలకు సెల్యూట్ చేస్తున్నాను.
సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ చనిపోయినప్పుడు వాళ్లు చూపించిన ఐక్యత దేశ ఐక్యతకు మార్గ సూచికంగా కనిపించింది. కానీ కాంగ్రెస్ దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నది. విభజించి పాలించడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది'' అని మోడీ అన్నారు.