Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్ క్రమంగా అదుపులోకి వస్తోంది. దీంతో కోవిడ్ థర్డ్‌వేవ్ ముప్పు తప్పినట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముందురోజు లక్షలోపు నమోదైన కొత్త కేసులు.. తాజాగా మరింత తగ్గి 67 వేలకు దిగిరావడం ఊరట కలిగిస్తోంది.
సోమవారం 13 లక్షల మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 67,597 మందిలో వైరస్ ఉన్నట్టు తేలింది. పరీక్షల సంఖ్య తగ్గినా .. రోజురోజుకూ పాజిటివిటీ రేటు క్షీణించడం సానుకూలాంశం. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 5శాతానికి తగ్గింది.
ఇదే సమయంలో.. మృతుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
వెయ్యికిపైగా మరణాలు..
కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. భారత్‌లో కరోనా మరణాలు వెయ్యికి పైగా నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలోనే 1,188 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో.. మృతుల సంఖ్య 5,02,874కు పెరిగింది.
10 లక్షల దిగువకు క్రియాశీల కేసులు..
దేశంలో కోవిడ్ క్రియాశీల రేటు తగ్గుతున్నది. రికవరీ రేటు మెరుగవుతున్నది. నిన్న ఒక్కరోజే 1,80,456 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ రెండేళ్ల వ్యవధిలో 4.23 కోట్ల మందికి వైరస్ సోకగా.. 4.08 కోట్ల (96.46 శాతం) మంది వైరస్‌ను జయించారు. ఇక క్రియాశీల కేసులు 10 లక్షల దిగువకు పడిపోయాయి. ఆ కేసుల రేటు 2.35 శాతానికి చేరింది.
170 కోట్లకు పైగా వ్యాక్సిన్లు పంపిణీ..
దేశంలో కరోనా టీకా కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నది. గత ఏడాది జనవరి నుంచి 170 కోట్ల టీకా డోసుల్ని పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఇప్పటి వరకు దేశ్యాప్తంగా 1,70,21,72,615 డోసుల వ్యాక్సిన్లు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 55.7 లక్షల మంది టీకా వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా డైలీ పాజిటివిటీ రేటు 5.02 శాతానికి దిగివచ్చింది.