Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు
అగర్తల : త్రిపురలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవడంతో.. అక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది. త్రిపురకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సుదీప్ రారు, ఆశిష్ కుమార్ సాహా అసెంబ్లీ శాసనసభ స్థానాలకు, పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. అనంతరం మంగళవారం ఢిల్లీలోని కాంగ్రెస్ అధినేత రాహుల్ ఇంటికి చేరుకుంటున్నట్టు సమాచారం. త్రిపుర అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించిన తర్వాత మాజీ మంత్రులు సుదీప్ రారు బర్మన్, ఆశిష్ కుమార్ సాహా ఇద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. 'మా రాజీనామాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ సాహాకు పంపాం. రేపు ఢిల్లీకి వెళ్తున్నాము. తిరిగి శనివారం ఇక్కడికి వస్తాం. అప్పుడు మా భవిష్యత్తు, రాజకీయ ఎత్తుగడ గురించి వివరంగా చెబుతాం' అన్నారు.