Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో వామపక్ష ఎంపీలు ధర్నా
న్యూఢిల్లీ : బడ్జెట్ కేటాయింపుల్లో కేరళపై వివక్ష తగదని సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం విమర్శించారు. బుధవారం పార్లమెంట్ ఆవరణంలో గేట్ నెంబర్ ఒకటి వద్ద వామపక్ష ఎంపీలు ధర్నా చేపట్టారు. ''కేరళపై వివక్ష ఆపాలి. కేటాయింపులు పెంచాలి. జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఆందోళన. మాకు బడ్జెట్ కేటాయింపులు కావాలి'' అంటూ ప్లకార్డులు చేబూని నినాదాల హౌరెత్తించారు. ఈ సందర్భంగా ఎలమారం కరీం మాట్లాడుతూ బడ్జెట్లో కేరళ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఎంపీలు సోమ ప్రసాద్, వి.శివదాసన్, జాన్ బ్రిట్టాస్, ఎఎం ఆరీఫ్, సీపీఐ ఎంపీ బినరు విశ్వం, కేరళ కాంగ్రెస్ ఎంపీ కెఎం మణి తదితరులు పాల్గొన్నారు.