Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ వ్యాపారవేత్త ఆత్మహత్యాయత్నం..
బాగ్పట్: వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయిన యూపీలోని రాజీవ్ తోమర్ (40) అనే వ్యాపారి తన భార్యతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో వ్యాపారి భార్య చనిపోగా, ఆయన ఆస్పత్రిపాలయ్యాడు. ఫేస్బుక్ లైవ్‌లో ఆయన ఆత్మహత్యా యత్నానికి పాల్పడటంతో సోషల్ మీడియాలో ఈ వీడియో సంచలనమవుతోంది. మోడీ విధానాల వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారంటూ రెండు నిమిషాల వీడియోలో రాజీవ్ తోమర్ ఆరోపించడం, ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ ఈ ఘటన చోటుచేసుకోవడంతో రాజకీయ వర్గాల్లోనూ ఇది హాట్‌టాపిక్‌గా మారింది.
జీఎస్టీ దెబ్బతీసిందంటూ..
ఆత్మహత్యానికి ప్రయత్నించిన వీడియోలో రాజీవ్ తోమర్ (40) ఒక చిన్న సంచీ (సాచెట్)లోని పదార్ధాన్ని మింగుతుండగా ఆయన భార్య అడ్డుపడింది. అతన్ని ఉమ్మేయమని శతవిధాలా నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. నాకు మాట్లాడే హక్కు ఉన్నది. చేసిన రుణాలు చెల్లించాల్సి ఉన్నది. నేను చనిపోయినా రుణాలు తీరుతాయి. అయితే నా విజ్ఞప్తి ఒక్కటే. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత మందికి ఈ వీడియోను షేర్ చేయండి. నేనేమీ జాతి వ్యతిరేకిని కాదు. దేశంపై నాకు నమ్మకం ఉంది. నేను మోడీజీ (ప్రధాని మోడీ)కి ఒకటి చెప్పదలచుకున్నాను. మీరు చిన్న వ్యాపారులు, రైతుల శ్రేయోభిలాషి కాదు. మీరు మీ విధానాలు మార్చుకోండి'' అని తోమర్ కన్నీటి పర్యంతమయ్యాడు. కాగా, ఫేస్‌బుక్‌ను చూస్తున్న కొందరు ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ దంపతులిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. 38 ఏండ్ల పూనమ్ తోమర్ చికిత్సపొందుతూ కన్నుమూసింది.