Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హౌం సహాయ మంత్రి నిత్యానందరారు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదని కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి నిత్యానందరారు అన్నారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరారు సమాధానమిచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు లేఖలు రాసిందని అన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య కొన్ని ఆస్తులు విషయంలో సయోధ్య కుదరట్లేదన్నారు. ఏకాభిప్రాయంత ఆస్తుల విభజన జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే 26 సమావేశాలు నిర్వహించామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కొన్ని సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల మధ్య పరస్పర ఒప్పందం అవసరమని పేర్కొన్నారు. అంతేగాక చర్చలు, పరస్పర సంప్రదింపుల ద్వారా ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు.
ప్రధాని మోడీపై సభా హక్కుల ఉల్లంఘన! : టీఆర్ఎస్
ప్రధాని మోడీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చే అంశాన్ని టీఆర్ఎస్ పరిశీలిస్తున్నది. రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా ఉన్నాయని టిఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు. పార్లమెంట్ నిబంధనలు, నియమాల మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఆమోదం పొందిందనీ స్పష్టంచేశారు. పార్లమెంట్ కార్యకలాపాలను, చట్టసభను దిగజార్చేలా, పార్లమెంట్ ప్రిసైడింగ్ అధికారులను అగౌరవ పరిచేలా ప్రధాని వ్యాఖ్యలున్నాయని కేకే ఆరోపించారు.