Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్లో చేరిన మహిళా మోర్చా ప్రెసిడెంట్
డెహ్రడూన్ : మరికొన్ని రోజుల్లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా.. బీజేపీకి షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి భగత్ సింగ్ కోశ్యారీ బంధువు, బిందుఖట్టా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ మాయా కోశ్యారీ.. మంగళవారం బీజేపీని వీడి, కాంగ్రెస్లో చేరారు.
తనతో పాటు ఆరుగురు ఆఫీస్ బేర్సర్తో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, లాల్కూవాన్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి హరీష్ రావత్ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. అంతకముందు జనవరిలో బీజేపీ బహిష్కృత నేత, మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ కూడా కాంగ్రెస్లో చేరిన సంగతి విదితమే.