Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసు విచారణ విస్తృత ధర్మాసనానికి ..
- బదిలీ చేసిన కర్నాటక హైకోర్టు
- మరో రెండువారాల పాటు విద్యాసంస్థల వద్ద నిషేధం
బెంగళూరు: హిజాబ్ వస్త్రధా రణ వివాదం అగ్గిరాజేస్తోంది. కర్నాటకలో ఈ వివాదం కారణం గా నిన్న పలు ప్రాంతాల్లో రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని ఉద్రిక్త వాతావ రణం నెలకొన్న విషయం తెలిసిందే. అయినా అక్కడ పరిస్థితులు సద్దుమణగలేదు. బుధవారం కూడా కళాశాలల వద్ద విద్యార్థులు హిజాబ్, కాషాయ కండువాలు ధరించి ర్యాలీలు నిర్వహిం చారు. మరోవైపు ఈ వివాదంపై దాఖలైన పిటి షన్ కర్నాటకలోని ఏకసభ్య ధర్మాసనం నిన్న ,నేడు (బుధవారం) మరోసారి విచారణ చేపట్టింది. ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. హిజాబ్ ధరిస్తే పాఠశాలలకు అనుమతించకపోవడంపై ఐదుగురు విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థులు తమ నమ్మ కాలను పాటిస్తూనే స్కూళ్లకు వెళ్లేలా తాత్కాలిక ఉపశమనం కల్పించాలని పిటిషనర్ల తరఫు న్యాయ వాది కోర్టును కోరారు. అయితే ఇందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. విద్యార్థులందరూ డ్రెస్‌కోడ్‌ను పాటించాల్సిందేనని వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఏకసభ్య ధర్మాసనం.. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు తీర్పు వెలువరించింది. ఇంకోవైపు అక్కడి బొమ్మై సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు వ్యాప్తంగా విద్యాసంస్థల వద్ద ఆందోళనలపై నిషేధం విధించింది. ''బెంగళూరులోని స్కూళ్లు, కాలేజీ గేట్ల నుంచి 200 మీటర్ల పరిధిలో ఎలాంటి సమూహాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అనుమతి లేదు. వీటిపై రెండు వారాల పాటు నిషేధం విధిస్తున్నాం'' అని పోలీసు శాఖ వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విద్యాసంస్థల వద్ద ఫిబ్రవరి 22 వరకు సెక్షన్ 144 విధిస్తున్నట్టు తెలిపింది.