Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ 5 రాష్ట్రాల్లో ఇంకా ఆందోళనకరంగానే..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమక్రమంగా అదుపులోకి వస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, జనవరి 21 నాటి గరిష్ట స్థితితో పోలిస్తే కేసులు 80శాతం తగ్గాయని తెలిపింది. ఇక నాలుగు రాష్ట్రాల్లో క్రియాశీల కేసుల సంఖ్య 50వేల పైన ఉందని పేర్కొంది. దేశంలో వైరస్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా మీడియా సమావేశం నిర్వహించింది.
5శాతం దిగువకు పాజిటివిటీ రేటు
ఈ ఏడాది జనవరి 24వ తేదీన పాజిటివిటీ రేటు రికార్డు స్థాయిలో 20.75శాతానికి పెరిగింది. అయితే ప్రస్తుతం అది 4.44 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దీనిబట్టి చూస్తే వైరస్ వ్యాప్తి రేటు క్రమంగా తగ్గుతోందని అన్నారు. ఇక జనవరి 21న కొత్త కేసులు ఏకంగా 3.47 లక్షలు దాటాయి. అప్పటితో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య 80శాతం తగ్గిందని పేర్కొన్నారు. కేరళలో కరోనా వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. అక్కడ రోజువారీ పాజిటివిటీ రేటు అత్యధికంగా 29.57శాతంగా ఉంది. ఇక మిజోరం, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలలోనూ పాజిటివిటీ రేటు ఆందోళనకరంగానే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.