Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం ప్రతిపాదనలు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఎల్ఐసీలో ఐదు శాతం వాటాల విక్రయానికి కేంద్రం దస్త్రాలను సిద్దం చేసిందని సమాచారం. ఇనిషీయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లో భాగంగా ఈ వాటాలను అమ్మకానికి పెట్టనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వారు తెలిపారు. ఎల్ఐసీ 632 కోట్ల షేర్లలో ఈ దఫా 31.2 కోట్ల షేర్లను మార్కెట్ శక్తులకు ఆఫర్ చేయనుందని పేరు చెప్పుకోవడానికి ఆసక్తి లేని వ్యక్తులు తెలిపారని బ్లూమ్బర్గ్ రిపోర్ట్ చేసింది. ఐపీఓకు సంబంధించిన దస్త్రాలను ఈ వారంలోనే సెబీకి సమర్పించనున్నారని వెల్లడించారు. ఇప్పటికీ సంప్రదింపులు సాగుతున్నాయని.. మరిన్ని మార్పులు జరగొచ్చన్నారు. ఎల్ఐసీ మిగులు (ఎంబాడెడ్) విలువ రూ.5.4 లక్షల కోట్లుగా అంచనా వేశారన్నారు. కాగా.. ఈక్విటీ షేర్ ధర నిర్ణయం ప్రక్రియలోనే ఉందన్నారు. శుక్రవారం ఎల్ఐసీ బోర్డు భేటీ జరగనుందన్నారు. ఈ సమావేశం తర్వాత స్పష్టత రావొచ్చన్నారు. దీనిపై ఎల్ఐసీ, ఆర్థిక మంత్రిత్వ శాఖల ప్రతినిధులు స్పందించడానికి నిరాకరించారు. దాదాపుగా రూ.40 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులున్న ఎల్ఐసీలోని వాటాలను చౌకగా మార్కెట్ శక్తులకు కట్టబెడుతున్నారనే విమర్శలు పెరిగాయి. వచ్చే నెల మార్చి ముగింపు నాటికి వాటాల విక్రయాన్ని పూర్తి చేయాలని మోడీ సర్కార్ తలపెట్టింది. ఈ ఇష్యూ ద్వారా దాదాపు రూ.1 లక్ష కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.