Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానం
- బెంగళూరు 10.. ఢిల్లీకి 11వ స్థానం : నివేదిక
న్యూఢిల్లీ : దేశ వాణిజ్య రాజధాని ముంబయి ప్రపంచంలోనే ఐదో అత్యంత రద్దీ నగరంగా నిలిచింది. బెంగళూరు పదో స్థానంలో ఉన్నది. 2021 ఏడాదికి గానూ టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ గ్లోబల్ టాప్ 25 లిస్ట్‌లో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 58 దేశాలలో 404 నగరాలకు గానూ దేశ రాజధాని ఢిల్లీ 11వ స్థానంలో ఉన్నది. మహారాష్ట్రలోని మరో నగరం పుణే 21వ స్థానంలో నిలిచింది. 2019తో పోల్చుకుంటే 2021లో ఢిల్లీలో రద్దీ స్థాయి14శాతం తగ్గింది. ముంబయిలో 18శాతం, బెంగళూరులో 32శాతం,పుణేలో 29శాతం చొప్పున రద్దీ స్థాయి తగ్గింది. ఇక ప్రపంచవ్యా ప్తంగా టర్కీ నగరం ఇస్తాంబుల్ అత్యంత రద్దీ కలిగిన నగరంగా నిలిచింది. రష్యా రాజధాని మాస్కో రెండో స్థానంలో ఉన్నది. కరోనా మహమ్మారికి ముందు పరిస్థితితో పోల్చుకుంటే దేశంలో రద్దీ స్థాయి 23 శాతం తక్కువగా ఉన్నది. 2021లో ఢిల్లీలో రద్దీ స్థాయి 48 పాయిట్లుగా ఉన్నది. 2019లో ఇది 53గా ఉన్నది. ఐదు పాయింట్ల తగ్గుదల కనిపించింది.