Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో గురువారం జరిగిన తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా తొలిదశలో 59.61శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. తొలిదశ పోలింగ్‌లో 58 స్థానాలకు గాను 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది.ఉదయం 7గంటలకు ప్రారంభమై న పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. కరోనా నిబంధన లు అమలు చేస్తూ.. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లుచేశామని అధికారులు తెలిపారు.మొదటి దశ పోలింగ్ బరిలో.. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ-ఆర్ఎల్డీ,ఆప్,ఎంఐఎం పార్టీలు పోటీలో ఉన్నాయి. అలాగే సీఎం యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌కు చెందిన శ్రీకాంత్ శర్మ, సురేశ్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్,అతుల్ గర్గ్, చౌధురి లక్ష్మీ నారాయణ్‌తో పాటు మరో ముగ్గురు మంత్రులు ఈ దశలో తమ అదఅష్టాన్ని పరీక్షించుకోనున్నారు.కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించినట్టు అధికారులు తెలిపారు.ఈవీఎం సమస్య మినహా ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల వరకు 20.03 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు 35.03 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా శామ్లి జిల్లాలో 41.6 శాతం పోలింగ్ నమోదయింది.