Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 82 దేశాల ప్రయాణికులు వెంటనే టెస్ట్‌లు చేయించుకోనక్కర్లేదు
- అంతర్జాతీయ ప్రయాణికులకు ఆంక్షల సడలింపు
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ప్రయాణికులకు నూతన కరోనా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఏడు రోజుల హోం క్వారంటైన్లో ఉండాలన్న గతంలో నిబంధనలను ఆరోగ్య శాఖ సడలించింది.'ఎట్ రిస్క్'జాబితాలోని 82దేశాల నుంచి వచ్చే ప్రయాణికు లంతా దేశంలోకి వచ్చిన వెంటనే పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.82 దేశాలకు'ఎట్ రిస్క్'ట్యాగ్‌ను రద్దు చేసింది. దేశంలోకి వచ్చిన తరువాత 14రోజుల స్వీయ పర్యవేక్షణలో ఉండాలి.ప్రయాణం చేసేముందు72గంటల్లోపు తీసుకున్న ఆర్టి-పిసిఆర్ నివేదికను అందజే యాలి.సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌లో పూర్తి సమాచారం ఇచ్చి, నెగెటివ్ పత్రం లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన వారినే విమానంలోకి ఎక్కేం దుకు అనుమతించాలి.నౌకాశ్రాయాలు,విమానా శ్రాయాల ద్వారా దేశంలో కి ప్రవేశించే విదేశీ ప్రయాణికులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి.ఈ సవరించిన నిబంధనలు ఈ నెల14నుంచి అమల్లోకి రానున్నాయి.కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే విమానంలోకి ఎక్కించు కోవాలి.ప్రయాణికులు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలి.ప్రయాణంలో ప్రయాణికులెవరైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు చెబితే వారిని ప్రొటోకాల్స్ ప్రకారం ఐసోలేషన్‌లో ఉంచాలి.