Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ వాకౌట్
- లోక్‌సభలో ప్లకార్డులతో ఎంపీల నిరసన
న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలు గురువారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే.. టీఆర్ఎస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకువెళ్లారు. సురేశ్ రెడ్డి, సంతోష్ కుమార్, బడుగల లింగయ్య యాదవ్‌లు వెల్‌లోకి వెళ్లి నిరసనలు వ్యక్తం చేశారు. ప్రధానిపై ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌పై నిర్ణయం తీసుకోవాలని ఎంపీ కేశవరావు డిప్యూటీ చైర్మెన్ హరివంశ్‌ను కోరారు. ఆ సందర్భంలో ఆయన స్పందిస్తూ.. సభా హక్కుల నోటీసు అందిందని, కానీ దానిపై చైర్మెన్ వెంకయ్య నిర్ణయం తీసుకుంటారని హరివంశ్ తెలిపారు. చైర్మెన్ పరిశీలన కోసం ప్రివిలేజ్ నోటీసును పంపినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు కూడా టీఆర్ఎస్ వాదనతో ఏకీభవించిచాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే కూడా టీఆర్ఎస్ కు మద్దతు పలికారు. ప్రివిలేజ్ నోటీసుపై ఛైర్మన్ నిర్ణయం తీసుకునే వరకు సభకు వెళ్లరాదని తెరాస ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాన చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు అదేవిధంగా ఎనిమిదేండ్ల తర్వాత కూడా ప్రధాని మీడియా సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించకుండా, మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూలపైనే ఆధారపడాల్సి రావడం సిగ్గుచేటు అన్నారు. రెండు సభల్లో పాసైన బిల్లుపై ప్రధాని కామెంట్ చేయడం శోచనీయమన్నారు.
లోక్‌సభ పోడియం వద్ద టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన
లోక్‌సభలోనూ టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు.సభ ప్రారంభ మయ్యాక..వెల్‌లోకి దూసుకువెళ్లి నిరసనకు దిగారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ రెండు రోజుల కిందట ్ధ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీపై టీఆర్ఎస్ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌కు ఆ నోటీసులు అందజేశారు. టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డుల తో వెల్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు.నామా నాగేశ్వరరావు నేతృత్వంలో లోక్‌సభ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. నోటీసుపై నిర్ణయం తీసుకునే దాకా సభల్ని బారుకాట్ చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిసైడ్ అయ్యారు.