Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ప్లేయర్ ఏం అన్నారంటే...
న్యూఢిల్లీ : కర్నాటకలో హిజాబ్ వివాదం ఖండాంతరాలను తాకింది. 'భారత్‌లో హిందూత్వ మూకలు హిజాబ్ ధరించకూడదంటూ ముస్లిం మహిళలను వేధిస్తూనే ఉన్నాయి' అంటూ మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ ప్లేయర్ పాల్ పోగ్బా ఇన్స్టామ్ వేదికగా పోస్టు పెట్టారు. ఫ్రాన్స్ దేశస్తుడైన పోగ్బా తల్లి ముస్లిం. వాస్తవంగా ఆయన లండన్‌కు చెందిన ఓ ఇన్‌స్టా ఖాతాకు చెందిన ఈ వీడియోను ఆయన కూడా పోస్టు చేశారు. ఈ వీడియోలో కాషాయ కండువాలు కప్పుకున్న అబ్బాయిల గుంపుతో పాటు హిజాబ్ ధరించిన యువతుల బృందం కనిపిస్తున్నది. అందులో అబ్బాయిల గుంపు నినాదాలు చేస్తూ రచ్చ చేస్తున్న దృశ్యాలున్నాయి. మరికొంత మంది అబ్బాయిలు.. అక్కడ హిజాబ్ ధరించిన మహిళల చుట్టూ రక్షణగా ఏర్పడుతున్నట్టు చూడవచ్చు. నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్ జారు కూడా ఈ విషయంపై స్పందించిన విషయం తెలిసిందే.