Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు దిగి వస్తున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా 14 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 58,077 కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 657 మంది మరణించారు. దీంతో కరోనా కేసులు 4.25 కోట్లకు చేరుకోగా.. మొత్తంగా ఇప్పటి వరకు 5.07 లక్షల మంది కోవిడ్‌కు బలయ్యారు. పాజిటివిటీ రేటు 3.89 శాతానికి పడిపోయింది. క్రియా శీలక కేసుల సంఖ్య 6.97 లక్షలకు చేరుకున్నాయి. యాక్టివ్ కేసుల రేటు 1.64 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 1.50 లక్షల మంది కోలుకోగా.. ప్రస్తుతం 4.13 కోట్ల మంది కరోనాను జయించారు. రికవరీ రేటు 97.17 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 171 కోట్ల వ్యాక్సిన్ల వినియోగమయ్యాయి.