Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డేటా ప్రకారం.. భారత్లో 2020లో సైబర్ క్రైమ్ 11శాతం పెరిగింది. ఎన్సీఆర్బీ 'క్రైమ్ ఇన్ ఇండియా 2019' నివేదిక ప్రకారం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సైబర్ క్రైమ్స్ 2017లో 21,796 నమోదు కాగా, 2018లో 27,248, 2019లో 44,735చోటుచేసుకున్నాయని హౌం మంత్రిత్వ శాఖ .. హౌం శాఖ కమిటీకి తెలిపింది. 2020లో 50035 సైబర్ క్రైమ్స్ నమోదయ్యాయి. 2020 డేటాకు సంబంధించిన ఎన్సిఆర్బి 'క్రైమ్ ఇన్ ఇండియా 2020' నివేదికలో పొందుపరిచింది. 2019తో పోలిస్తే.. 2020లో సైబర్ క్రైమ్స్ 11. 8 శాతం పెరిగాయి. 2020లో నమోదైన సైబర్ క్రైమ్ కేసుల్లో 60.2 శాతం మోసం (50,035 కేసుల్లో 30,142), లైంగిక దోపిడీ 6.6 శాతం (3,293 కేసులు), దోపిడీ 4.9 శాతం (2,440 కేసులు) చోటుచేసుకున్నాయి. సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తులు కొత్త పద్ధతులను ఎంచుకోవడంతో కేసులు పెరుగుదలపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులకు కమిటీ అందించిన నివేదిక ప్రకారం.. పంజాబ్, రాజస్తాన్, గోవా, అసోం వంటి రాష్ట్రాల్లో ఒక్క సైబర్ క్రైమ్ సెల్ లేదు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో ఒకటి లేదా రెండు సైబర్ సెల్స్ మాత్రమే ఏర్పాటుచేసినట్టు నివేదిక తెలిపింది.