Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థర్డ్‌వేవ్,లాక్డౌన్ ఆంక్షలతో ప్రభావితం
- కేంద్ర గణాంకాల శాఖ
న్యూఢిల్లీ : గడిచిన ఏడాది డిసెంబర్ మాసంలో దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్థి 0.4శాతానికి పరిమితమై 10మాసాల కనిష్ట స్థాయికి దిగజారింది. కరోనా మూడో వేవ్ లాక్డౌన్ ఆంక్షలు ఉత్పత్తి కార్యకలాపాలను ప్రభావితం చేశాయని కేంద్ర గణంకాల శాఖ తెలిపింది. తయారీ రంగం ఉత్పత్తి పెరుగుదల ఏకంగా 0.1 శాతానికి పరిమితం కాగా గనులు,విద్యుత్ రంగాలు వరుసగా 2.6 శాతం, 2.8 శాతం చొప్పున వృద్ధిని కనబర్చాయి. కాపిటల్ గూడ్స్, కన్సూమర్ డ్యూరెబుల్స్ రంగాలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. 2021-22లో దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం పెరగనుందని ఆర్బీఐ అంచనా వేయగా.. సూక్ష్మ గణంకాలు ఇలా పేలవంగా నమోదు కావడం ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.