Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాక్‌పై సర్జికల్ స్రైక్ట్స్పై రాహుల్ ఆధారాలు అడగడంపై స్పందిస్తూ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడనేందుకు రుజువు చూపించమని రాహుల్‌ను తామెప్పుడూ కోరలేదంటూ వ్యాఖ్యానించారు.
మాజీ కాంగ్రెస్ నేత అయిన హిమంత. 2015లో బిజెపి గూటికి చేరారు. ఉత్తరాఖండ్ ఎన్నికల నేపధ్యంలో ప్రచారంలో పాల్గన్న ఆయన.. ' సర్జికల్ స్ట్రైక్స్ సంబంధించిన ఆధారాలు చూపించాలని కాంగ్రెస్ కోరుతోంది. రాహుల్ పుట్టుక గురించి మేమెప్పుడైనా అడిగామా' అంటూ అసహ్య పదజాలాన్ని వినియోగించారు. మెరుపు దాడులు చేపట్టారని మన సైనికులు చెబితే.. అదే ఫైనలని, దానికి ఆధారాలు చూపించండని వారిని ప్రశ్నించే హక్కు ఎవరిచ్చారు అంటూ రాహుల్‌పై మండిపడ్డారు.
అదేవిధంగా దేశ సమాఖ్యపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌పై కూడా మండిపడ్డారు. కొన్ని సార్లు వారే భారత్ ఓ దేశం కాదని, రాష్ట్రాల సముదాయమని అంటారని, ఇదంతా వింటుంటే జిన్నా ఆత్మ కాంగ్రెస్‌లోకి వచ్చిందా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు.
హిజాబ్ వివాదంపైనా స్పందిస్తూ. పాఠశాలలు, కళాశాలలో కేవలం యూనిఫాం మాత్రమే అనుమతించాలన్నారు. ఇది విద్యార్థుల మధ్య సమానత్వాన్ని, గౌరవాన్ని పెంపొందిస్తుందని అన్నారు.