Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొల్కతా : కేంద్రంలో మోడీ సర్కార్‌కు ఏజెంటులా వ్యవహరిస్తూ రోజుకో వివాదం సృష్టిస్తున్న పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధనకర్ తాజాగా అసెంబ్లీని ప్రోరోగ్ చేసి మరో వివాదానికి తెర లేపారు. రాజ్‌భవన్‌కు మధ్య దెబ్బతిన్న సంబంధాల్లో తాజా ట్విస్ట్ చోటు చేసుకుంది. శనివారం నుంచి అమల్లోకి వచ్చేలా పశ్చిమ బెంగాల్ శాసనసభను గవర్నర్ జగదీప్ ధన్కర్ ప్రోరోగ్ చేశారు. ఆయన చర్య రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని పరిశీలకులు పేర్కొంటున్నారు. 'రాజ్యాంగంలోని 174వ అధికరణలో 2వ క్లాజులో సబ్ క్లాజు (ఏ) కింద నాకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని అసెంబ్లీని తక్షణమే అమల్లోకి వచ్చేలా ప్రొరోగ్ చేస్తున్నాను' అని గవర్నర్ ట్వీట్ చేశారు. తన సంతకంతో వున్న ఉత్తర్వులను దానికి జత పరిచారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముందుండగా ఈ పరిణామం సంభవించింది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌కి వ్యతిరేకంగా తీర్మానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచినస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. గవర్నరు చర్య రాజకీయ దురుద్దేశంతోకూడుకున్నదని వారు విమర్శించారు. గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలను ప్రోరోగ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్‌ను సభకు సమర్పించలేదు. దానివల్ల ప్రభుత్వ పనితీరు ప్రభావితమవుతుంది. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం.