Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జవాను మృతి.. మరో జవాన్‌కు తీవ్ర గాయాలు
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పాతగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మావోయిస్టులకు.. పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో జవాన్ మృతిచెందారు. మరో జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా ఎస్పీ కమలోచన్ కస్యప్ తెలిపిన వివరాల ప్రకారం..ల్లాలోని బాషగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్‌కు ఆనుకుని ఉన్న పుట్కేల్ అడవుల్లో సీఆర్పీఎఫ్ 168 బెటాలియన్ జవాన్లు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అసిస్టెంట్ కమాండెంట్ ఎస్బీ టిర్కీ మృతిచెందారు. గాయపడిన మరో జవాన్‌ను మెరుగైన వైద్యం కోసం జగదల్పూర్ తరలించారు.