Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్‌కు ప్రచారం శనివారంతో ముగిసింది. మొత్తంగా తొమ్మిది జిల్లాల పరిధిలోని 55 సీట్లకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో జరిగే ఎన్నికల్లో 586మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. షహరాన్‌పూర్, బిజ్నోర్, ముర్దాబాద్, సంభాల్, రాంపూర్, అమ్రోహా, బుదాన్, బరేలి, షాజహాన్‌పూర్ జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా వుంది. ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీకి గట్టి పట్టు వుందని భావిస్తున్నారు. సమాజ్‌వాదీ సీనియర్ నేత మహ్మద్ ఆజంఖాన్, యోగి ప్రభుత్వంలో మంత్రిగా వుండి ఎన్నికలు ప్రకటించిన తర్వాత సమాజ్‌వాదీలోకి ఫిరాయించిన ధరమ్ సింగ్ సైని, యూపీ ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా తదితరులు ఈ ప్రాంతంలో బరిలో ఉన్నారు.