Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మెన్ రాహుల్ బజాజ్ శనివారం మరణించారు. 82 ఏండ్ల రాహుల్ బజాజ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. గత కొద్ది రోజులుగా న్యుమోనియా, గుండె సమస్యలతో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. చికిత్స నిమిత్తం నెల రోజులుగా పూణెలోని రూబీ హాల్ క్లినిక్‌లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారని బజాజ్ గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది. రాహుల్ బజాజ్ మృతి పట్ల అనేక మంది కార్పొరేట్ కంపెనీల అధినేతలు సంతాపం వ్యక్తం చేశారు. గతేడాది ఏప్రిల్‌లో బజాజ్ ఆటో చైర్మెన్‌గా,నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలకు ఆయన రాజీనామా చేశారు. 1965లో బజాజ్ గ్రూపు బాధ్యతలు చేపట్టిన ఆయన దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆ కంపెనీకి సారధ్యం వహించారు. 2005లో తన కుమారుడు రాజీవ్ బజాజ్‌కు కంపెనీ బాధ్యతలు అప్పగించారు.