Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హౌంశాఖ కీలక సమావేశం
- అజెండా నుంచి ప్రత్యేక హౌదా తొలగింపు
న్యూఢిల్లీ : ప్రత్యేక హౌదాతో పాటు నాలుగు అంశాలను కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ తొలగించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలపై ఈ నెల 17న కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రత్యేక హౌదా అంశాన్ని అజెండా నుంచి కేంద్రం తొలగించింది. ప్రత్యేక హౌదా, రెవెన్యూ లోటు, వెనుకబడిన జిల్లాకు నిధులు, పన్ను రాయితీ అంశాలను తొలగిస్తూ లేఖ రాసింది. కేంద్ర హౌం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృ త్వంలో జరిగే ఈ సమావేశం తొమ్మిది అంశాలతో కూడిన అజెండాను శనివారం ఉదయం ప్రకటించింది. అయితే, అజెండాలో కొన్ని మార్పులు చేస్తూ శనివారం సాయంత్రం మరోసారి కేంద్ర హౌంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఐదు అంశాలను మాత్రమే పొందిపరిచింది. విభజన కమిటీ అజెండాలో ఏపీ ప్రత్యేక హౌదా, రెవెన్యూ లోటు లేదని తెలిపింది. మొదట ఇచ్చిన సర్క్యులర్లో ఎనిమిదో అంశంగా ప్రత్యేక హౌదా ఉంది. అయితే హౌదా అంశాన్ని తొలగిస్తూ కేంద్రం రెండో సర్క్యులర్ విడుదల చేసింది. ఏపి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, ఏపి జెన్కో, తెలంగాణ డిస్కమ్ మధ్య విద్యుత్ బకాయిల వివాదం, పన్ను విధానంలో ఉన్న వ్యత్యాసం తొలగింపు, నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల విభజన, ఏపిఎస్సీఎస్సీఎల్, టీఎస్సీఎస్సీఎల్ నగదు నిల్వల అంశంపై చర్చించనున్నట్టు కేంద్ర హౌం శాఖ అజెండాలో పేర్కొంది. ఎజెండాలో సవరణలు చేస్తూ రాష్ట్రాలకు కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. 9 అంశాల నుంచి 5 అంశాలకే కేంద్ర హౌం శాఖ పరిమితం చేసింది. వెనుకబడిన జిల్లాకు నిధులు, పన్ను రాయితీలను కేంద్రం తొలగించింది. ఈ నెల 8న జరిగిన సమావేశంలో కమిటీ ఏర్పా టుకు కేంద్ర హౌం శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలు గు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర హౌంశాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్, ఏపి నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్.ఎస్ రావత్, తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రత్యే ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈమేరకు తెలుగు రాష్ట్రాల సిఎస్ లకు కేంద్ర హౌంశాఖ సమాచారం పంపింది.