Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోవా, ఉత్తరాఖండ్‌తోపాటు యూపీ రెండో దశకు ఏర్పాట్లు పూర్తి
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని 55 అసెంబ్లీ స్థానాలకు, గోవా, ఉత్తరాఖండ్‌లోని అన్ని నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 81 లక్షల మంది ఓటర్లున్న ఉత్తరాఖండ్‌లో 70 స్థానాల్లో 152 మంది స్వతంత్రులతో సహా 632 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోవాలో 11 లక్షల మంది ఓటర్లు ఉండగా, 40 అసెంబ్లీ స్థానాల నుంచి 301 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒకే దశలో సోమవారం ఎన్నికలు జరగనున్న ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉండేది. ఈ సారి ఆప్ బరిలోకి దిగడం, గోవాలో టీఎంసీ వంటి చిన్న పార్టీలు కూడా పోటీ పడుతుండటంతో బహుముఖ పోటీ నెలకొంది.ఉత్తర ప్రదేశ్‌లోని రోహిల్ఖండ్సహా తొమ్మిది జిల్లాల పరిధిలో ఉన్న55 సీట్లకు జరగనున్న ఈ రెండో దశ ఎన్నికల్లో 586మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ఈ మూడు రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఉత్తరాఖండ్‌లో పోలింగ్ సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటల వరకూ జరుగుతుంది. మిగిలిన రాష్ట్రాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు తెలిపారు. స్వేచ్ఛగా, సక్రమంగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటుగా కోవిడ్ నిబంధనలను కూడా కచ్చితంగా అమలు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గోవా, ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రులు ప్రమోద్ సావంత్, పుష్కర్ సింగ్ ధామి, మాజీ సీఎం హరీశ్ రావత్, యూపీలో జైలు శిక్ష అనుభవిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు.