Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీఎఫ్కు 26,275 కోట్లకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసు దళాల అభివృద్ధి, ఆధునికీకరణ కోసం ప్రత్యేక పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆమోదం తెలిపింది. 2021-22 నుంచి 2025-26 వరకు అమలయ్యే పోలీసు దళాల ఆధునికీకరణ (ఎంపీఎఫ్) పథకానికి ఆమోదం తెలిపినట్టు కేంద్ర హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. వివిధ ఉప పథకాలు దీనిలో ఉంటాయని, మొత్తం మీద రూ.26,275 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది.