Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారానికి రైతు సెగ
- వేదికపై జై శ్రీరామ్ అంటూ కేంద్రహోంమంత్రి నినాదాలు
పటియాలా: కేంద్రహౌం శాఖమంత్రి అమిత్ షాకు రైతు సెగ తగిలింది. పంజాబ్‌లోని పటియాలాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనటానికి వచ్చిన ఆయనకు వ్యతిరేకంగా సంయుక్త్ కిసాన్ మోర్చా(ఎస్కేఎం)పంజాబ్ శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కనీసమద్దతు ధర (ఎంఎస్పీ)తో పాటు మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుచేయకుండా.. తాత్సారం చేస్తోన్న విషయం విదితమే. దీనిలో భాగంగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారాలు, ఓటు చేయాలని రైతు సంఘాలు కోరుతున్న విషయం విదితమే. ఇప్పటికే యూపీ సహ పలు రాష్ట్రాల్లో బీజేపీ నాయకులకు సెగలు తాకుతుంటే..తాజాగా పంజాబ్‌లోనూ కేంద్రహౌం శాఖమంత్రికీ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. సభాస్థలి వద్దకు రైతులు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో భద్రతాబలగాలు మొహరించాయి. అయినా రైతులు వెనక్కితగ్గలేదు.రోడ్డుపై బైటాయించారు.ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడిగటానికి వచ్చారంటూ నిలదీశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఉద్యమాల్లో అమరులను కించపర్చేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారనీ, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నేతల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తామని రైతు నేతలు స్పష్టం చేశారు. కాగా.. కాంగ్రెస్, ఆఫ్ సహా అన్ని ప్రతిపక్షాలను అమిత్‌షా టార్గెట్ చేశారు.ఐదేండ్లలో డ్రగ్స్ రహిత పంజాబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. పంజాబ్‌ను దేశంలోనే నంబర్-1గా నిలపాలంటే.. బీజేపీకి ఓట్లు వేయాలని కోరారు. వేదికపై నుంచి అమిత్ షా జై శ్రీరామ్ నినాదాలు చేశారు. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ కనిపించారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం..
పంజాబ్ రైతుల కోసం అందరూ చాలా మాట్లాడతారని హౌంమంత్రి షా అన్నారు. ఇప్పుడు పంజాబ్‌లో వ్యవసాయ విధానాన్ని కూడా మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. రైతుల ఆదాయానికి గండి పడకుండా వ్యవసాయం చేసే విధానాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం కేంద్రంతో ఉంటూ అభివృద్ధి చేయగల ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు.