Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కొత్త కేసుల సంఖ్య 35 వేల దిగువకు చేరింది. కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... 24 గంటల వ్యవధిలో 10.67 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిం చగా, 34,113 కొత్త కేసులు వెలుగుచూ శాయి. క్రితం రోజుతో పోలిస్తే 10 వేల కన్నా తక్కువ. మరణాలు కూడా సగానికి పైగా తగ్గాయి. తాజాగా 346 మందిని కరోనా బలితీసుకుంది. తొలి వేవ్ మొదలైన నాటి నుంచి 4,26,65,534 కేసులు నమోదు కాగా, 5,09,011 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 91,930 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ రేటు 97.68 శాతంగా ఉంది. ప్రస్తుతం 4.78 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.