Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ ప్రజలకు ఎస్‌కెఎం నేతల పిలుపు
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో రైతు వ్యతిరేకి బీజేపీని శిక్షించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) నేతలకు పిలుపునిచ్చారు. 'మిషన్ ఉత్తరప్రదేశ్''లో భాగంగా సోమవారం కాన్పూర్ ప్రెస్‌క్లబ్‌లో పార్స్ కాన్ఫరెన్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌కెఎం నేతలు హన్నన్ మొల్లా, రాకేష్ తికాయత్, యోగేంద్ర యాదవ్, శివకుమార్ కక్కాజీ, సునీలం, ముకుత్ సింగ్, రాజ్వీర్ సింగ్ మాట్లాడారు. హన్నన్ మొల్లా మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటూ బీజేపీ ప్రభుత్వం చేసిన లిఖిత పూర్వక హామీలను నెరవేర్చనందున బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఎస్‌కెఎంకు కేంద్రం ఇచ్చిన హామీని గుర్తు చేసేందుకే జనవరి 31న విద్రోహ దినాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఎస్‌కెఎం నేత రాకేష్ తికాయత్ మాట్లాడుతూ ప్రజలు చాలా కోపంగా ఉన్నారని, బీజేపీికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. యువ రైతు ఉపాధి కోసం అడుగుతున్నారని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని, ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరిందని, చెరకు చెల్లింపు ఆగిపోయిందన్నారు. హిందువులు, ముస్లిముల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నంలో బీజేపీ బిజీగా ఉందన్నారు.బీజేపీ హిజాబ్ గురించి మాట్లాడితే ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో ఆ వివరాలు అడగాలని అన్నారు. యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ తాము ఏ పార్టీకి ఓట్లు అడగడం లేదని, రైతులకు ద్రోహం చేసిన బీజేపీని శిక్షించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇంత కాలం గడిచిన తరువాత ఇప్పుడు కమిటీ ఏర్పాటుకు ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవడాన్ని ప్రభుత్వం సాకుగా చూపుతోందని అన్నారు. మతతత్వ శక్తులను ఓడించాలని సునీలం పిలుపు ఇచ్చారు. బీజేపీని ఎందుకు శిక్షించాలో శివకుమార్ కక్కాజీ వివరించారు. మత, కుల రాజకీయాలను శిక్షించాలని ముకుత్ సింగ్ విజ్ఞప్తి చేశారు.