Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఎమ్మెల్యే
లక్నో : ముస్లింలను అవమానించేలా బీజేపీ ఎమ్మెల్యే రాఘవేంద్ర సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్గా మారింది. తాను తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికైతే.. ముస్లింలు హిజాబ్ తీసివేసి నుదుటిన తిలకం దిద్దిస్తానంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కేసు నమోదైనట్టు యూపీ పోలీసులు తెలిపారు. దొమరియాగంజల్లో మొదటిసారి అధికశాతం మంది హిందువులు పోటీ చేస్తున్నారని, ఈ నియోజకవర్గంలో 'సలాం' ఉంటుందా.. 'జైశ్రీరాం' ఉంటుందో చూద్దామని సవాలు విసిరారు. అలాగే తాను తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికైతే ముస్లింల హిజాబ్ అదశ్యమైనట్లే.. మియాన్ చిట్టా (ముస్లింలను అగౌరవపరిచే పదం) తిలకం ధరిస్తారని సింగ్ పేర్కొన్నారు. తాజాగా సోమవారం ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఇక్కడ ఇస్లామిక్ ఉగ్రవాదులు ఉన్నందున హిందువులు కూడా హిజాబ్ ధరించాలని షరతు విధించారని చెప్పానని అన్నారు. తాను హిందువుల గౌరవ ప్రతిష్టల కోసం ఎలాంటి త్యాగానికికైనా సిద్ధమని, తనను ఓడించడానికి ముస్లింలు యత్నిస్తుంటే .. తాను మౌనంగా ఉండనని చెప్పానని రాఘవేంద్ర సింగ్ అన్నారు. రాఘవేంద్ర సింగ్ ప్రస్తుతం హిందూ యువవాహిని యూపీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు.