Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ ఎమ్మెల్యే
బెంగళూరు : ప్రస్తుతం కర్నాటక నుంచి దేశవ్యాప్తంగా నడుస్తోన్న వివాదం హిజాబ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నోరు జారారు. హిజాబ్ ధరించకపోవడం వల్లే దేశంలో లైంగికదాడుల రేటు అత్యధికంగా ఉందంటూ కర్నాటక ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'హిజాబ్ అంటే ఇస్లాంలో ముసుగు(పర్దా) బాలికలు యుక్త వయస్సుకు వచ్చే సరికి వారి అందాన్ని ఈ ముసుగు కప్పి ఉంచుతుంది. మన దేశంలో లైంగికదాడుల రేటు చూస్తూనే ఉన్నాం. దానికి కారణం ఏమనుకుంటున్నారు..? చాలా మంది మహిళలు హిజాబ్ ధరించకపోవడం వల్లే' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ ధరించడం తప్పనిసరికానప్పటికీ... ఎవరైతే తమకు రక్షణ కావాలనుకుంటున్నారో, తమ అందం ప్రదర్శించాలనుకోవడం లేదో వారు మాత్రమే హిజాబ్‌ను ధరిస్తారనీ, ఇది ఎన్నో సంవత్సరాలుగా ఆచరణలో ఉందని అన్నారు.