Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ తాజా వ్యూహం
- వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ?
అమరావతి : ఏపీలో మూడు రాజధానుల అంశం వివాదాస్పదం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వ్యూహన్ని రూపొందించినట్లు తెలిసింది. ఒక రాజధానితో పాటు రెండు ఉపరాజధానులను ప్రతిపాదించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అమరావతిని రాష్ట్ర రాజధానిగా పేర్కొంటూనే విశాఖపట్నం, కర్నూలును ఉప రాజధానులుగా ప్రకటించనుంది. ఈ మేరకు రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధిచి న్యాయపరమైన అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. గతంలో మాదిరి న్యాయ వివాదాలు తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయినట్లు చెబుతున్నారు. దీంతో ప్రతి అంశాన్ని అన్ని కోణాల నుండి పరిశీలిస్తూ బిల్లును రూపొందించే పనిలో అధికారయంత్రాంగం నిమగమైంది. పరిపాలనా సౌలభ్యం రీత్యా ఉపరాజధానుల్లో అనుబంధ అనుబంధ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే విధంగా బిల్లులో ప్రస్తావించనున్నారు. గతంలో విశాఖలో ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తే హెచ్ఓడిల నుండి ఖర్చును వసూలు చేస్తామని కోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలసిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉపరాజధానుల పేరుతో ఈ వ్యవహారాన్ని ముందుకు నడిపించాలని భావిస్తున్నారు. హైకోర్టు విషయంలో మాత్రం కొంత తర్జన భర్జన పడుతున్నట్లు తెలిసింది. కేంద్ర న్యాయశాఖ నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో ఎలా చేయాలన్న అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. ముందే న్యాయరాజధాని కర్నూలు అని ప్రకటిస్తే విశాఖలో బెంచ్ ఏర్పాటు వ్యవహారం సమస్యగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఉప రాజధానులుగా ప్రకటన చేసి ముందుగా కొంత పరిపాలన ఆయా ప్రాంతాల్లో నుండి మొదలుపెడితే ఇబ్బందులు వచ్చే అవకాశం లేదని తెలిసింది.