Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'యూపీలో ఉండాలంటే యోగి అనాల్సిందే.బీజేపీ ఓటు వేయనివారిని తొక్కించేందుకు బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయి' అంటూ బీజేపీఎల్పీ నేత ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం సోషల్మీ డియా వేదికగా వివాదాస్పద వీడియోను విడుదల చేశారు. ''యూపీలో రెండు విడతల ఎన్నికలు పూర్తయ్యాయి.మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.హిందువులంతా ఏకమవ్వాలి.యోగికి ఓటు వేయకుం టే జేసీబీ, బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నికల తరువా త యోగికి ఓటు వేయని వారిని గుర్తిస్తాం.యూపీలో ఉండాలంటే యోగికి జైకొట్టాలి. లేకపోతే యూపీ వదిలి పారిపోవాలి. యూపీలో యోగిబాబా ప్రభుత్వం రాబోతుంది''అంటూ ప్రజల్ని హెచ్చరించారు.