Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోనిపట్ వద్ద స్టేషనరీ ట్రక్‌ను కారు ఢకొీనడంతో ప్రమాదం..
- ఎర్రకోట వద్ద రైతులు
చేపట్టిన ఆందోళనలో నిందితుడు..
సోనిపట్: ప్రముఖ పంజాబ్ నటుడు దీప్ సిద్ధూ మృతి చెందారు. హర్యానాలోని సోనిపట్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. దీప్ సిద్ధూ మృతిని సోనిపట్ పోలీసులు ధ్రువీకరించారు. ఢిల్లీ నుంచి భటిండా వైపు వెళ్తుండగా హర్యానాలోని సోనిపట్ వద్ద ఆయన కారు ఓ స్టేషనరీ ట్రక్‌ను ఢకొీట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. పంజాబ్‌లోని ముక్త్సర్ జిల్లాకు చెందిన దీప్ లా చదివారు. గతంలో మోడల్‌గా పనిచేసి.. తర్వాత పలు పంజాబీ చిత్రాల్లో నటించాడు. గతంలో కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంలో చేరిన దీప్ సిద్ధూ.. గతేడాది రైతులు చేపట్టిన రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. రైతుల ట్రాక్టర్ ర్యాలీతో సిద్ధూ పేరు మార్మోగింది. కొందరు ఆందోళనకారులను రెచ్చగొట్టి ఎర్రకోట వైపు మళ్లించారనే ఆరోపణలు సిద్ధూపై ఉన్నాయి. అయితే దీనివెనుక బీజేపీ శ్రేణుల హస్తం ఉన్నట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో నిందితుడిగా సిద్ధూ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. అయితే పంజాబ్ ఎన్నికల ముందు జరిగిన ఈ ప్రమాదం వెనుక..రాజకీయం కోణం లేకపోలేదన్న చర్చ నడుస్తున్నది.