Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగపూర్ ప్రధాని లీహ్సీన్ లూంగ్
- తొలి ప్రధాని నెహ్రూపై పొగడ్తలు
- సింగపూర్ ప్రధాని ప్రసంగంపై భారత్ నిరసన
న్యూఢిల్లీ : భారత ప్రజాస్వామ్యం క్షీణించిందని సింగపూర్ ప్రధాని లీ హ్సీన్ లూంగ్ ఆదేశ పార్లమెంటులో వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారత మొదటి ప్రధాని జవహరల్‌లాల్ నెహ్రూను కూడా సింగపూర్ ప్రధాని ప్రశంసించారు. మోడీ పాలనలో నయా ఇండియా అనసరిస్తున్న ప్రజావ్యతిరేక పాలనను ప్రస్తా విస్తూ..ఇటీవల ఆ దేశ పార్లమెంటులో సింగపూర్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇపుడు దీనిపై భారత్ నిరసన తెలిపింది. ఈ ప్రసంగానికి సంబంధించి భారత దేశంలోని సింగపూర్ రాయబారి సైమన్ వాంగ్‌ను బుధవారం ఎంఈఏకి పిలిచినట్టు సమాచారం. '' సింగపూర్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు అనవసరం. మేం ఈ విషయాన్ని సింగపూర్ వైపు తీసుకుంటున్నాం'' అని ఎంఈఏ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా నేరారోపణలు ఉన్న చట్టసభ సభ్యులతో నిండిన భారత పార్లమె ంటు ఒకటి.. అని పీఎం లీ వర్ణించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసిందని దౌత్య వర్గాలు తెలిపాయి. సింగపూర్ ప్రధాని ప్రజాస్వామ్య క్షీణత విషయంలో భారత్‌ను తీసుకురావడాన్ని భారత దౌత్యవేత్తలు నిరసించారని వివరించాయి. ఎలక్టోరల్ వాచ్డాగ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం 2019లో ఎన్నికైన 17వ లోక్ సభలో 2004 నుంచి అత్యధిక సంఖ్యలో సభ్యులు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలలో దాదాపు 43 శాతం మందిపై నేరారోపణలు, 29 శాతం మంది తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో గోవా విముక్తి నుంచి చైనాతో సంబంధాలు, భారత దేశ విభజన వరకు అనేక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీతో సహా అధికార పార్టీ నాయకులు నెహ్రూపై తమ సంప్రదాయ విమర్శలను పలు సార్లు లేవనెత్తుతున్న విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో సింగపూర్ ప్రధాని.. నెహ్రూను పొగడటం, ఆయన ఆలోచన మార్గంలో దేశం నడవటం లేదని మాట్లాడటం గమనార్హం. అయితే ఈ మాటల వెనుక ఎవరు ఉన్నారు.? అనే కోణంలో జాతీయ భద్రతా సలహాదారునితో మోడీ ప్రభుత్వం ఆరా తీస్తోంది. సింగపూర్ ప్రధాని వ్యాఖ్యల వెనుక అర్బన్ నక్సల్స్, ప్రెస్టిట్యూషన్స్ పాత్ర ఉండొచ్చని భారత్ ప్రాధమిక అంచనాకొచ్చింది. మరోవైపు ఎన్ఫోర్స్ డైరెక్టర్ (ఈడీ) కూడా మరో దర్యాప్తు చేసేలా కేంద్రం బాధ్యతలు అప్పగించింది. సింగపూర్ సంస్థలు, భారత్‌లో ఉన్న అనుబంధ సంస్థల విభాగాలతో సింగపూర్ ప్రధానికి ఉన్న అనుబంధాలపై కూడా ఈడీ ఆరా తీయనున్నది.