Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంప్రదాయ వస్త్రధారణలో హిజాబ్ భాగం కాదు : కర్నాటక ప్రభుత్వం
న్యూఢిల్లీ : హిజాబ్ వివాదాన్ని మరింతగా సాగదీయాలన్న వ్యూహంతో బీజేపీ సర్కార్ అడుగులు వేస్తోంది. దేశంలో కోట్లాది మంది యువత మధ్య మత చిచ్చు పెట్టిన ఈ వివాదాన్ని చల్లార్చే విధంగా కాకుండా..పెంచే విధంగా వ్యవహరిస్తోంది. తాజాగా కర్నాటక హైకోర్టులో సంచలన వ్యాఖ్యలు చేసింది. హిజాబ్ ముస్లిం సంప్రదాయ వస్త్రధారణలో భాగం కాదని కర్నాటక హైకోర్టుకు ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ప్రభులింగ్ నవదగ్ వివరించారు. హిజాబ్ వివాదంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ కొనసాగించింది. ఏకరూప దుస్తులు ధరించాలన్న ప్రభుత్వ ఆదేశం రాజ్యాంగంలోని మతస్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించలేదని ఏజీ స్పష్టం చేశారు. హిజాబ్ ధరించటం వారి మౌలిక హక్కా? కాదా ? అన్న అంశాన్ని పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. మరింత సమయం కావాలని ఏజీ కోరడంతో..ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయటం వల్ల అభ్యంతరాలు, ఆక్షేపణలు పెరుగుతాయని పిటిషనర్ తరఫు న్యాయవాది రవివర్మ కుమార్ చెప్పారు. ఈ ప్రసారం వల్ల ప్రతిపాదనలు ఎలా ఉంటాయో ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా? అని జస్టిస్ అవస్థీ అభిప్రాయపడ్డారు.