Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : డివైఎఫ్ఐ 11వ అఖిల భారత మహాసభలు పశ్చిమ బెంగాల్లో జరగనున్నాయి. మే 12 నుంచి 15 వరకు జరిగే ఈ మహాసభలు పశ్చిమ బెంగాల్లోని తూర్పు జోనల్ కల్చరల్ సెంటర్, సాల్ట్ లేక్ వేదిక కానున్నది. మహాసభలు నిర్వహించే ప్రాంతానికి డియెగో మారడోనా నగర్, షహీద్ మంచ్ అనే నామకరణం చేశారు. మహాసభల నిర్వహణ కోసం శనివారం ఆహ్వాన సంఘం ఏర్పాటు అయింది. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎఎ రహీమ్, అభరు ముఖర్జీ, డివైఎఫ్ఐ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి మీనాక్షి ముఖర్జీ మాట్లాడారు.