Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ అండతో హిందూత్వ శక్తుల కుయుక్తులు
- ఒక్కో అంశంతో 'విభజన' రాజకీయాలు
- కూడు నుంచి గుడ్డ వరకు.. ప్రతీదీ వివాదం చేస్తున్న వైనం
న్యూఢిల్లీ : ప్రపంచంలో అనేక దేశాలతో పోలిస్తే భారత్ భిన్నమైనది. ఇది అనేక మతాలు, సంస్కృతులు, సంప్రదాయల కలయిక. అయితే, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉన్న భారత్‌పై హిందూత్వ శక్తుల చర్యలపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మతం పేరుతో సమజాంలో సామరస్యాన్ని చెడగొడుతున్నదని ఆరోపించారు. మతాలకతీతంగా అన్నదమ్ముల్లా కలిసి ఉండే ప్రజలలో విషబీజాలు నాటుతూ వారిలో విభజనను తీసుకొస్తున్నదని వివరించారు. వీరికి ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీ మద్దతునిస్తున్నదని ఆరోపించారు.
భారత్‌లో హిందూ, ముస్లిం, క్రైస్తవులు.. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ ఆచారాలను పాటిస్తూ పరమత సహనాన్ని పాటిస్తూ కలిసి మెలిసి జీవిస్తున్నారు. అయితే, ఇలాంటి చక్కటి మతసామరస్యాన్ని హిందూత్వ శక్తులు చెడగొడుతున్నాయని విశ్లేషకులు తెలిపారు. తినే తిండి నుంచి కట్టుకునే బట్ట దాకా.. ప్రతి ఒక్క అంశాన్నీ హిందూత్వ శక్తులు రాజకీయం చేస్తున్నాయని చెప్పారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయని విశ్లేషకులు అన్నారు. మెజారిటేరియన్ సంస్కృతిని పోషిస్తూ మైనారిటీలో అస్థిత్వాన్ని మోడీ ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చిందని ఆందోళన చెందారు.
ముఖ్యంగా ఎన్నికల సమయాల్లోనే ఇలాంటి మత సంబంధ సున్నితమైన అంశాలను హిందూత్వ శక్తులు ముందుకు తీసుకొస్తాయని విశ్లేషకులు తెలిపారు. ఇలాంటి శక్తులకు బీజేపీ మద్దతు తోడవటం ఆందోళనకరమన్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతన్నాయి. అందునా యూపీ వంటి పెద్ద రాష్ట్రం బీజేపీకి చాలా కీలకం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక నెగ్గాలని బీజేపీ భావిస్తున్నది. అయితే, ఐదేండ్ల యోగి పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొన్ని ఉన్నది. మరోపక్క, పార్టీపై గట్టుపట్టు సాధించిన అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వైపు ప్రస్తుతం గాలి వీస్తున్నది. ఈ నేపథ్యంలో ఓటర్లను మతం కోణంలో ప్రభావితం చేసేలా వారిలో విభజనకు ప్రయత్నించిందనీ, కర్నాటకలోని హిజాబ్ వివాదం ఇందులో భాగమని విశ్లేషకులు తెలిపారు. అంతేకాకుండా, ఏయిరిండియా, ఎల్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కారు కార్పొరేట్లకు, బడా వ్యాపారవేత్తలక కట్టబెడుతున్నది. మరోపక్క, భారత్‌లో నిరుద్యోగమూ అంతకు మించి పెరిగిపోతున్నది. అయితే, ఇలాంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హిజాబ్ అంశంపై బీజేపీ ప్రభుత్వాలు దృష్టిని సారించాయని విశ్లేషకులు చెప్పారు. హలాల్, గోవధ, హిజాబ్, చైనా, పాక్ దేశాలపై ద్వేషపూరిత ప్రసంగాలు, సీఏఏ, ఎన్నార్సీ వంటి వివాదాస్పద అంశాలతో ఎన్నికలకు ముందు వివాదం చేయడం బీజేపీకి అలవాటేనని గుర్తు చేశారు.