Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వం సిద్ధం
చండీగఢ్ : ఆదివారం జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రాష్ట్రంలో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,304 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీపడుతున్నారు. వీరిలో 93 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్, శిరోమణి అకాళీదళ్-బిఎస్పి కూటమి, బిజెపి- పంజాబ్ లోక్ కాంగ్రెస్- శిరోమణి అకాళీదళ్ (సంక్యుక్త్) కూటమి పడుతున్నాయి. రాష్ట్రంలో మొత్తంగా 2,14,99,804 మంది ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ కోసం 24,689 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో 2,103 బూత్‌లను సమస్యాత్మకంగా గుర్తించారు. పోలింగ్ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు యూపీలో మూడో దశ
ఉత్తరప్రదేశ్‌లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. 16 జిల్లాల్లోని 59 నియోజవర్గాల్లో నేడు ఎన్నికలు నిర్వహించనున్నారు. హత్రాస్, ఫిరోజబాద్, ఇతాV్‌ా, కాస్గంజ్, మెయిన్‌పురి, ఫర్రూఖ్బాద్, కన్నౌజ్, ఇతావాV్‌ా, ఔరైయా, కన్పూర్ దెహత్, కన్పూర్నగర్, జలౌన్, ఝాన్సీ, లలిత్పూర్, హమిర్పూర్, మహోబా జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నాయి.