Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరుణాచల్‌ప్రదేశ్ అవతరణ్సోతంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్‌ను ఆగేయాసియాకు ప్రధాన గేట్వేగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్ 36వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు ఆయన ఆ రాష్ట్ర ప్రజలకు వీడియో సందేశం పంపారు. 'జాతీయ భద్రత ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆధునిక మౌలిక సదుపాయాలను వేగంగా నిర్మిస్తున్నట్లు మోడీ చెప్పారు. 1987లో ఫిబ్రవరి 20న కేంద్రపాలిత ప్రాంతం నుంచి రాష్ట్ర హోదాను పొందింది. దేశాభివృద్ధికి తూర్పు భారతదేశం ప్రధానంగా ఈశాన్య ప్రాంతాలు ఇంజిన్‌గా ఉంటాయనేది తమ నమ్మకమని మోడీ తెలిపారు. 'మీ విశ్వాసం డబుల్ ఇంజన్ ప్రభుత్వం మరింత కష్టపడి పనిచేయడానికి ప్రోత్సాహం ఇస్తుంది' అని ఆయన అన్నారు. గత ఏడేళ్లల్లో రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడానికి కృషి చేశామన్నారు. ఈశాన్య ప్రాంతంలోని అన్ని రాష్ట్ర రాజధానులను రైల్వే ద్వారా అనుసంధానించడం తమ ప్రాధాన్యత అని ప్రధాని మోడీ తెలిపారు.