Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ ఉధృతి మరింత తగ్గుముఖం పడుతోంది. గత రెండు రోజుల నుండి 30 వేల దిగువనే రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 11,87,766 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 19,968 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజు కన్నా 2,300 తక్కువని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తాజాగా 673 మంది మృత్యువాత పడ్డారు. దీంతో తొలివేవ్ మొదలైన నాటి నుండి కరోనా బారిన పడిన వారి సంఖ్య 4.28 కోట్లకు చేరుకోగా, మహమ్మారికి బలైన పోయిన వారు 5.11 లక్షలకు పైమాటే. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 48, 847 మంది కోలుకోగా.. మొత్తంగా 4.20 కోట్ల మంది మహమ్మారిని జయించారు. రికవరీ రేటు 98.28 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 2.24 లక్షలుగా ఉన్నాయి. క్రియా శీల రేటు 0.52కి పడిపోయింది. గడిచి 24 గంటల్లో 30.81 లక్షల మంది టీకాలు తీసుకోగా.. ఇప్పటి వరకు 175 కోట్ల డోసుల వినియోగమయ్యాయి.