Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ మూడోదశ పోలింగ్‌లో ఉద్రిక్తం
న్యూఢిల్లీ: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 63.44 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. శార్దుల్ఘడ్లో అత్యధికంగా 83 శాతం పోలింగ్ నమోదు కాగా గిద్దర్బాహా, జలాలాబాద్‌లలో 77 శాతం, ఫజిల్కా 74.5, మన్సా 74, మలేర్‌కోట్లలో 72.8శాతం పోలింగ్ నమోదైంది. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలుండగా ఒకేవిడతలో పోలింగ్ జరిగింది. పంజాబ్‌లో ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్ధూ, అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌తో పాటు ఇతర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడోదశ పోలింగ్ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. మూడో విడతలో 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది. సాయంత్రం 5 గంటల వరకు 57.44 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. యూపీలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన కాన్పుర్‌లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 59 సీట్లకు పోలింగ్ జరగగా వీటిలో 2017లో 49 స్థానాలను కైవసం చేసుకోవడం గమనార్హం.
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పోటీలో ఉన్న కర్హాల్ నియోజకవర్గంలో 62 శాతం పోలింగ్ రికార్డయ్యింది. యాదవ్‌లకు గట్టి పట్టున్న మెయిన్‌పురి జిల్లాలో ఉన్న ఈ సీటుపైనే అందరూ దృష్టి సారించారు. అఖిలేశ్‌కు ప్రత్యర్థిగా బీజేపీ నుంచి కేంద్రమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్‌ను పోటీలో నిలిపింది. 1992లో ఎస్పీ ఏర్పాటైన నాటి నుంచి కేవలం ఒకేఒక్కసారి కర్హల్‌లో ఓడిపోయింది.